Saturday, April 27, 2024

‘వియర్‌ ఇట్‌ పెయిర్‌ ఇట్‌ ఎనీవేర్‌ ఇట్‌’ను ఆవిష్కరించిన ఫేమ్‌ ఫరెవర్‌ బై లైఫ్‌స్టైల్‌

తాజా ధోరణుల కోసం భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రం లైఫ్‌స్టైల్‌ తమ తాజా ప్రచారంను ఫేమ్‌ ఫరెవర్‌ కోసం ప్రారంభించింది. ‘వియర్‌ ఇట్‌. పెయిర్‌ ఇట్‌.ఎనీవేర్‌ ఇట్‌’ శీర్షికన దీనిని నిర్వహిస్తోంది. ఈ కలెక్షన్‌లో ఫంక్షనల్‌ పీసెస్‌ ఉన్నాయి. ఇవి స్త్రీ, పురుషులు మరియు చిన్నారులకు అందుబాటు ధరలలో లభిస్తాయి. ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్ సీఈఓ దేవరాజన్‌ అయ్యర్ మాట్లాడుతూ… ఫ్రేమ్‌ ఫరెవర్‌ బై లైఫ్‌స్టైల్‌ నుంచి నూతన కలెక్షన్‌ విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ కలెక్షన్‌ను త‌మ వినియోగదారుల సౌకర్యం, విలువ కోరుకునే విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దామన్నారు. ఈ కలెక్షన్‌లో ప్రతిఒక్కరికీ ఒకటి ఉందన్నారు. అత్యంత సంతోషకరమైన ధరల వద్ద ఇవి ఒకే చోట లభిస్తాయన్నారు. త‌మ వినియోగదారులు ఈ కలెక్షన్‌ను అన్వేషించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది విభిన్న మార్గాల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో పాటుగా కష్టపడకుండానే స్టైలింగ్‌ చేసుకోవచ్చని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement