Saturday, May 4, 2024

AG & P : ఏజీ అండ్ పీ ప్రథమ్, బీపీసీఎల్ భాగస్వామ్యంతో సీఎన్ జీ నెట్‌వర్క్ విస్తరణ

హైదరాబాద్ : భారతదేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) రంగంలో అగ్రగామిగా ఉన్న ఏజి&పి ప్రథమ్ ఈరోజు చిత్తూరు జిల్లాలో 14వ సీఎన్ జీ స్టేషన్‌కు తన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) నెట్‌వర్క్‌ను విస్తరించిన్నట్లు ప్రకటించింది.

ఈసంద‌ర్భంగా ఏజీ అండ్ పీ ప్రథమ్ రీజినల్ హెడ్ చిరాగ్ కె భన్వాడియా మాట్లాడుతూ… దేశం కీలకమైన గ్రీన్ ఎనర్జీ వినియోగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అంతటా త‌మ సహజ వాయువు పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై తాము దృష్టి సారించామన్నారు. ఏజి అండ్ పి ప్రథమ్ అందించే సీఎన్ జీ సేవలు ఆటోలు, కార్లు, చిన్న వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులతో సహా అనేక రకాల వాహనాలకు అందుతాయన్నారు.

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో కొత్తగా ప్రారంభించబడిన సీఎన్ జీ స్టేషన్ ద్వారా పరిశుభ్రమైన మరింత స్థిరమైన సీఎన్ జీ ని అందించడానికి ఏజి అండ్ పి ప్రథమ్ నిబద్ధతకు అనుగుణంగా, ప్రైవేట్, పబ్లిక్ రవాణా రెండింటికీ పర్యావరణ అనుకూల ఇంధన ప్రత్యామ్న్యాయాన్ని అందిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్న్యాయ ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించింద‌న్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ సహకారంతో సీఎన్జీని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే త‌మ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందన్నారు. హరిత భవిష్యత్ దిశగా భారతదేశం పరివర్తనకు దోహదం చేస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement