Sunday, May 5, 2024

NSEFI కు ప్రత్యేక సంప్రదింపు హోదాను మంజూరు చేసిన ECOSOC

హైద‌రాబాద్: కటారు రవి కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్న నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు 7 జూన్ 2023న యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రత్యేక సంప్రదింపుల హోదాను మంజూరు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా NSEFI చైర్మన్ కటారు రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఇది భారతీయ పునరుత్పాదక పరిశ్రమకు అందించబడిన అరుదైన గౌరవం, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం పరాక్రమం, విజయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు అని అన్నారు.

2030 నాటికి దేశంలో 500 జీడబ్ల్యూ ఆర్ఈ స్థాపిత సామర్థ్యం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం సాధించడానికి, నిర్ణీత సమయంలో నెట్ జీరో పరివర్తనను సాధించడానికి ఎన్ఎస్ఈఎఫ్ఐ కృషి చేస్తోందన్నారు. భారతదేశం సోలార్ మార్కెట్ సామర్థ్యంలో దాదాపు 95శాతం కలిగి ఉన్న 142 కంపెనీల విభిన్న సభ్యత్వంతో, ఎన్ఎస్ఈఎఫ్ఐ సౌరశక్తిని ప్రోత్సహించే లక్ష్యంకు కట్టుబడి ఉందన్నారు. తమ పని ప్రపంచవ్యాప్తంగా సోలార్ అసోసియేషన్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారాన్ని ఏర్పరుస్తుందన్నారు. ఈ రంగం అంతటా జ్ఞానాన్ని పంచుకోవడం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని సులభతరం చేస్తుందని, ఇది సౌరశక్తి రంగంలో ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌లను నడపడానికి ఎన్ఎస్ఈఎఫ్ఐకి అధికారం కల్పిస్తుందని కటారు రవి కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement