Saturday, May 18, 2024

హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ ముఠా గుట్టు ర‌ట్టు

నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డ్రగ్స్ ముఠాను పట్టుకుంది. ఇటీవలే నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఆధ్వర్యంలో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది ఎన్ఎస్‌డబ్ల్యూ. ఎన్ఎస్‌డబ్ల్యూ టీమ్ రాజస్తాన్‌కు చెందిన సురేష్ ను జీడిమెట్లలో అదుపులోకి తీసుకుంది. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గా సురేష్ ను గుర్తించింది. డ్రగ్ పెడ్లర్ తో పాటు నలుగురు వినియోగదారులను అరెస్టు చేసింది వింగ్. శాలిబండ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసింది నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్. ఈ సందర్భంగా మూడు లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం సురేష్‌ డ్రగ్స్ విక్రయించాలనుకున్నాడ‌ని నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement