Friday, April 26, 2024

కీచక డాక్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష.. చికిత్స కోసం వచ్చిన రోగితో ఆపని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చికిత్స కోసం వచ్చిన రోగిని లైంగికంగా వేధించిన ఓ కీచక డాక్టర్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు హైదరాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే… 2016లో ఓ మహిళ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డా. బండారి విజయ భాస్కర్‌ వద్దకు చికిత్స కోసం వెళ్లింది. ఆ సమయంలో డాక్టర్‌ బాధితురాలిని తాకకూడని చోట తాకాడు. బాధితురాలు ప్రశ్నించగా చికిత్సలో ఇది భాగమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత బాధితురాలు చికిత్స కోసం మళ్లి ఆ వైద్యుడి వద్దకు వెళ్లగా… ఆ సమయంలో ఓ మహిళ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వైద్యుడితో గొడవకు దిగడంతో డా. విజయభాస్కర్‌ తన తప్పును ఒప్పుకున్నాడు.

ఈ ఘటనను చూసిన బాధితురాలు గతంలో కావాలనే ఆ వైద్యుడు తనను అసభ్యకరంగా తాకాడని నిర్ధారించుకుని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన హైదరాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నేరం రుజువు కావడంతో ఐపీసీ సెక్షన్‌ 376(2)(ఈ), 354సెక్షన్ల కింద డా. విజయ భాస్కర్‌కు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.4వేలను జరిమానాగా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement