Tuesday, April 30, 2024

సుజలం సుఫలం అవగాహన సదస్సులో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

ఈనెల 22 నుంచి 31 వరకు జరుగుతున్న ప్రపంచ నీటి దినోత్సవ అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తార్నాక డివిజన్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో జలమే జనం, జలమే దానం, జలమే బలం, సుజలం సుఫలం అనే నినాదంతో అవగాహనా సదస్సు కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా విచ్చేసి నీరు వృధా చేయకుండా ఎలా కాపాడుకోవాలో, నీరు మన రోజువారి పనులకు ఎంత ఉపయోగకరమో తెలిపారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… వర్షపునీరు ఎలాగా వాడుకోవాలని, వర్షపు నీరు ఇంకుడు గుంతల్లోకి వెళ్లి ఎలాగా భూమిలోకి చేరాలో, అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేదే లేకుండా కాళేశ్వరమే కాకుండా ఎన్నో ఎత్తిపోతల ప్రాజెక్ట్ ల ద్వారా నీటి సమస్య అనేదే లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ స్వచ్ఛంద సంస్థ రామకృష్ణారెడ్డి, రవీందర్, జల మండలి అధికారులు మేనేజర్ నిఖిత, పాపారావు, అశోక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement