Wednesday, May 1, 2024

స్టూడెంట్ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన డెలివరూ

గ్లోబల్ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన డెలివరూ, భారతదేశంలో గ్రాడ్యుయేషన్ కాలేజీ విద్యార్థుల కోసం తన మొదటి ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆరు నెలల పెయిడ్ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో ఉన్న వినూత్న ఫుడ్-టెక్ కంపెనీ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈసంద‌ర్భంగా డెలివరూ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇంజినీరింగ్, కంట్రీ హెడ్ శశి సోమవరపు మాట్లాడుతూ… భారతదేశంలోని ఆశాజనకమైన ఇంజనీరింగ్ ప్రతిభావంతులకు ప్రతిరోజూ డెలివరూలో చోటు చేసుకునే సంచలనాత్మక సాంకేతికతలలో వారి అకడమిక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ను మెరుగు పరచడానికి తాము ఈ కార్యక్రమాన్ని రూపొందించామ‌న్నారు. వాసవి ఇంజినీరింగ్ కాలేజీతో త‌మ భాగస్వామ్యం మాదిరిగానే తాము భారతదేశంలోని ప్రీమియర్ విద్యా సంస్థలతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవాలని అనుకుంటున్నామ‌న్నారు.

డెలివరూ డెవలప్‌మెంట్ సెంటర్‌ లోని ఇంటర్న్‌ లలో ఒకరైన అశ్రిత లోకసాని మాట్లాడుతూ… డెలివరూతో త‌మ ప్రయాణం ఇప్పటివరకు అద్భుతంగా ఉందన్నారు. కళాశాల నుండి కార్పొరేట్ వాతావరణానికి మారడం త‌మకు లభించిన అన్ని రకాల మద్దతుతో సులభతరం చేయబడిందన్నారు. నైపుణ్యం కలిగిన, నిష్ణాతు లైన వ్యక్తులందరితో కలసి పని చేయడం ద్వారా తాను ప్రతి రోజు పనిలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రేరణ కలిగిందన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement