Monday, April 29, 2024

పుష్ప‌2 గ్లింప్స్ కి.. 100మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని అందించిందో తెలిసిందే. కాగా పుష్ప‌2 షూట్ కూడా జోరుగా కొన‌సాగుతుండ‌గా ఈ చిత్రంలోని గ్లింప్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ‌ర్త్ డేకి రిలీజ్ చేశారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ గ్లింప్స్ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ .. 3.3 మిలియన్ ప్లస్ లైక్స్ ను సంపాదించుకుంది. గ్లింప్స్ తోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలైందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.ద‌ర్శ‌కుడు సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా రూపొందుతోంది.రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రావు రమేశ్ .. సునీల్ .. ఫహాద్ ఫాజిల్ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ‘పుష్ప’కి పాన్ఇం డియా స్థాయిలో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, అంతకిమించి అనే స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement