Tuesday, May 7, 2024

Delhi | 35 మందితో బిజెపి మూడో లిస్ట్ విడుదల.. ముఖ్యనేతలకు చోటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల కోసం బుధవారం అర్థరాత్రి వరకు కసరత్తు చేసిన అధిష్టానం గురువారం మధ్యాహ్నం 35 పేర్లతో కూడిన మూడవ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, రెండో జాబితాలో ఒకే ఒక్క పేరును ప్రకటించింది. మొత్తం మూడు జాబితాల్లో కలిపి ఇప్పటి వరకు 88 నియోజకవర్గాలకు కమలనాథులు అభ్యర్థులను ప్రకటించారు.

‘బీసీ ముఖ్యమంత్రి’ నినాదంతో ఎన్నికల్లో ప్రజల ముందుకొచ్చిన బీజేపీ, జాబితాల్లో బీసీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది. తొలి జాబితాలో 19 మంది బీసీ నేతలుండగా, మూడవ జాబితాలో 13 మంది బీసీలున్నారు. ఇంకా 31 స్థానాలకు (జనసేనకు ఇచ్చే స్థానాలు కలిపి) అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలోనూ బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్ ఇంకా 19 స్థానాలకు (వామపక్షాలకు ఇచ్చే స్థానాలతో కలిపి) ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. కాంగ్రెస్ జాబితాను అనుసరిస్తూ బీజేపీ తదుపరి జాబితా ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కించుకోలేకపోయిన బలమైన నేతలకు గాలం వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. బుధవారం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, చలమల కృష్ణారెడ్డి, వి. సుభాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు ఆయా పార్టీల్లో టికెట్లు దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. వీరిలో కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డికి తదుపరి జాబితాలో చోటు కల్పించే అవకాశం ఉంది.

గురువారం విడుదల చేసిన మూడవ జాబితాలో పలువురు బీజేపీ ముఖ్యనేతలున్నారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను బీజేపీ నాయకత్వం ఈసారి బాన్సువాడ నుంచి బరిలోకి దింపింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి ఉప్పల్ నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఈ మధ్యనే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు చేవేళ్ల నుంచి పార్టీ టికెట్ కేటాయించింది. ఎన్డీఎంఏ వైస్ చైర్మన్‌గా పనిచేసిన మర్రి శశిధర్ రెడ్డి తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన సనత్ నగర్ నుంచి పోటీ చేయనున్నారు. ఆర్టీసీ మాజీ నేత అశ్వద్ధామ రెడ్డి వనపర్తి నుంచి బరిలోకి దిగారు. ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -

మూడో జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే

1.మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్

2.ఆసిపాబాద్-అజ్మీరా ఆత్మారాం నాయక్

3.బోధన్-వడ్డె మోహన్ రెడ్డి

4.బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ

5.నిజామాబాద్ రూరల్-దినేష్

6.మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి

7.మెదక్-పంజా విజయ్ కుమార్

8.నారాయణఖేడ్- జె.సంగప్ప

9.ఆంథోల్- బాబుమోహన్

10.జహీరాబాద్-రామచంద్ర రాజనర్సింహ

11. ఉప్పల్-ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్

12.ఎల్ బీ నగర్-సామ రంగారెడ్డి

13.రాజేంద్రనగర్-తోకల శ్రీనివాస్ రెడ్డి

14.చేవేళ్ల- కెఎస్ రత్నం

15. పరిగి-మారుతి కిరణ్

16. ముషీరాబాద్-పూస రాజు

17.మలక్ పేట-సురేందర్ రెడ్డి

18.అంబర్ పేట-కృష్ణయాదవ్

19. జూబ్లీహిల్స్-లంకల దీపక్ రెడ్డి

20.సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి

21.సికింద్రాబాద్-మేకల సారంగపాణి

22.నారాయణపేట-కె.రతంగ్ పాండురెడ్డి

23.జడ్చర్ల-చిత్తరంజన్ దాస్

24.మక్తల్-జలంధర్ రెడ్డి

25.వనపర్తి-ఆశ్వథామరెడ్డి

26. అచ్చంపేట-దేవని సతీష్ మాదిగ

27.దేవరకొండ-కేతావత్ లాలునాయక్

28.హుజూర్ నగర్-చల్లా శ్రీలత రెడ్డి

29.నల్గొండ-మాదగాని శ్రీనివాస్ గౌడ్

30.ఆలేరు-పడాల శ్రీనివాస్

31.పరకాల-కాళి ప్రసాద్ రావు

32.పినపాక-పొడియం బాలరాజు

33. పాలేరు-నూనె రవికుమార్

34. సత్తుపల్లి-రామలింగేశ్వరరావు

35.షాద్ నగర్- అందె బాబయ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement