Wednesday, May 1, 2024

యువ‌త కొంప‌ముంచుతున్న ‘హ్యాపీ హైపాక్సియా’….

హైదరాబాద్‌, : కరోనాతో నిత్యం ఆస్పత్రుల్లో చేరేవారిలో యువతనే ఎక్కువగా ఉంటుండడంతో వైద్య నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్‌ నిల్వలు తక్కు వగా ఉన్నా పరిస్థితి విషమిస్తున్న లక్షణాలు యువతలో కనిపిం చడం లేదు. దీన్నే వైద్యులు హ్యాపీ హైపాక్సియాగా చెబు తున్నారు. కోవిడ్‌ రోగుల్లో ఎక్కువ మంది యువతే ఉండ డానికి కారణంగా ‘హ్యాపీ హైపాక్సియా’ అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యువతకు కరోనా సోకినా వారిలో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోతున్నా ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురుకావు. దీంతో పరిస్థితి పూర్తిగా విషమించేదాకా తాము పూర్తి ఆరోగ్యంగా ఉన్నామనే యువత భావిస్తోంది. కరోనా నిర్ధారణ అయిన ఆరు రోజు తర్వాత యువతలో ఒక్కసారిగా ఆక్సిజన్‌ లెవల్స్‌ 94శాతం కంటే పడిపోయి ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ విభాగాల్లో చేరాల్సి వస్తోంది. ఆ దశలో యువత ఊపిరితిత్తుల్లో వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేరుతోంది. ఈ పరిస్థితుల్లో ”మేము వయసులో ఉన్నాం. మాకు ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉంది. కరోనా సోకినా మాకేం కాదు.” అన్న దోరణి మంచిదికాదని వైద్య నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. కరోనా బారిన పడుతున్నవారిలో యువత శాతమే ఎక్కువగా ఉంటోంది. కరోనా గురించి పూర్తి తెలిసిన యువతే… తెలియని వారికి అవగాహన కల్పించాల్సిన వారే కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్‌వేవ్‌లో ప్రతి 100మందిలో 80మందికి ఇంటి వద్దే నయమవుతోంది. మిగిలిన వారిలో కేవలం ఐదుగురికి మాత్రం ఆక్సిజన్‌ అవసరమవుతోంది. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురు యువకులే ఉంటున్నారు.
తాజా అధ్యయనాల ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్ప త్రుల్లో కరోనాతో వెంటిలేటర్‌పై ఉన్నవారిలో ఏకంగా 40 శాతం యువకులే కావడం ఆందోళన కలిగిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో 30-45 ఏళ్ల వయసు వారే కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో ఎక్కువగా యువతే వైరస్‌ బారిన పడుతున్నారు. గతంలో కరోనా చిన్నారుల మీద ప్రతాపం చూపింది. ఇప్పుడు యువతనే టార్గెట్‌ చేస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా పేషెంట్లలో యువతనే ఎక్కువగా ఉండడంతోపాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారిలోనూ వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్లలో హ్యాపీ హైపాక్సియా ప్రత్యేకమైనది
కరోనా వైరస్‌ కలిగించే ఇన్‌ఫెక్షన్లలో హ్యాపీ హైపాక్సియా ప్రత్యేకమైనది. వైరస్‌ మొదట ఊపరితిత్తుల రక్తప్రస రణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న గడ్డలు ఏర్పడి ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను శుద్దిచేసే సామర్థ్యం బాగా తగ్గిపోతోంది. దీంతో ఊపిరితిత్తుల నుంచి మెదడు కు సంకేతాల వ్యవస్థ ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. రక్తంలో గడ్డలు పెరిగి ఆక్సిజన్‌ శుద్ధి సామర్థ్యం తగగ్గడంతో ఊపిరితిత్తులపై పడిన ప్రభావం అప్పుడు మెదడుకు చేరుతోంది. అప్పటి వరకు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉన్నా పైకి లక్షణాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ సోకినా తర్వాత యువత లేటుగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ సోకిన వారు, లక్షణాలు ఉన్నవారు వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ శాతాన్ని చూసు కోవాలి. ఆరు రోజుల తర్వాత దశ చాలా కీలకమైనది. ఆక్సిజన్‌ లెవల్స్‌ 94శాతానికి తక్కువకు పడిపోతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్‌. కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి, నిజామాబాద్‌ జిల్లా మెడికల్‌ కళాశాల

Advertisement

తాజా వార్తలు

Advertisement