Monday, December 4, 2023

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సుశీల్ రెడ్డికి కాలేజ్ దేఖో మద్దతు

భారతదేశంలోనే అతిపెద్ద ఉన్నత విద్యా మార్గదర్శకత్వం, బలమైన సంస్థగా ఎదిగిన కాలేజ్ దేఖో స్థిరమైన సామర్థ్యం గురించి అవగాహన కల్పించే డ్రైవ్‌కు మద్దతు ఇస్తుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఈ ప్రయత్నంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సుశీల్ రెడ్డికి కాలేజ్ దేఖో మద్దతు ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనంపై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 5000 కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతున్నారు. అలాగే సుశీల్ రెడ్డి కొందరు ప్రముఖులను కలుసుకుంటున్నారు.

- Advertisement -
   


ఈ సందర్భంగా కాలేజ్ దేఖో సీఈవో, సహ వ్యవస్థాపకుడు రుచిర్ అరోరా మాట్లాడుతూ… కాలేజ్ దేఖో ఎల్లప్పుడూ మార్గదర్శకత్వంలో, సాధికారతలో ముందుందన్నారు. మంచి భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత, విద్యతో పాటు తర్వాత తరాన్ని ప్రభావితం చేసే రెండు కీలక అంశాలన్నారు. సుశీల్‌తో భాగస్వామ్యం దేశంలోని మన యువతలో పునరుత్పాదక శక్తిని, స్థిరమైన ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకునే విలువను పెంపొందించడానికి తమకు సహాయ పడుతుందన్నారు. హైదరాబాద్‌లోని విద్యార్థుల నుంచి సానుకూల స్పందన రావడంతో సుశీల్ రెడ్డి మాట్లాడుతూ.. సన్‌పెడల్ రైడ్ కోసం మరొక ప్రయాణాన్ని ప్రారంభించేందుకు, స్థిరమైన జీవన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తాను సంతోషిస్తున్నానన్నారు. వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి కాలేజ్‌దేఖో వంటి ఆలోచనాపరులైన భాగస్వాములను కలిగి ఉన్నందుకు తాము ఆనందపడుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement