Thursday, May 2, 2024

మేము ఆగము.. అనే ఒరిజినల్ పాటను పరిచయం చేసిన కోకాకోలా

తొలిసారిగా కోకాకోలా ఇండియా మేము ఆగము అనే ఒరిజినల్ పాటను పరిచయం చేసింది. ఈసంద‌ర్భంగా కోకా-కోలా ఇండియా అండ్ నైరుతీ ఆసియా వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ మార్కెటింగ్ అర్నబ్ రాయ్ మాట్లాడుతూ.. తెలుగు మార్కెట్ కోసం మ్యాజిక్ సృష్టించడానికి రెండు విభిన్న సంగీత సంస్కృతులు కలిసి రావడం ఇదే మొదటిసారన్నారు. అల్లు అర్జున్, అర్మాన్ మాలిక్, లాస్ట్ స్టోరీస్ అండ్ ట్రై.బీ లతో భాగస్వామ్యం నెరపడం త‌మకు చాలా ఆనందంగా ఉందన్నారు.

సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… కోక్ మ్యూజిక్ వీడియోలో భాగం కావడం చాలా అద్భుతంగా ఉందన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలను ఒకచోట చేర్చే సౌండ్ ట్రాక్. కె-పాప్ బ్యాండ్ ట్రై.బీ నుండి అగ్రశ్రేణి సంగీత ప్రతిభ, అర్మాన్ మాలిక్ అండ్ లాస్ట్ స్టోరీస్ వంటి గొప్ప భారతీయ ప్రతిభతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమ‌న్నారు. రికార్డ్ నిర్మాత అర్మాన్ మాలిక్ మాట్లాడుతూ… కోక్ సహకారంతో ఈ భారీ ప్రాజెక్టులో భాగం కావడం త‌నకు చాలా ఆనందంగా ఉందన్నారు. ట్రై.బీ కె-పాప్ కళాకారుడు మాట్లాడుతూ… కోకా-కోలా ఇండియా మొట్టమొదటి ఒరిజినల్ ట్రాక్ లో పాల్గొనగలగడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement