Tuesday, May 14, 2024

సూర్య‌42వ చిత్రం-చెన్నైలో గ్రాండ్ లాంఛింగ్

త‌మిళ స్టార్ హీరో సూర్య 42వ చిత్రం చెన్నైలో గ్రాండ్ గా లాంఛింగ్ అయింది. మాస్ డైరెక్ట‌ర్ సిరుతై శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొంద‌నుంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం చెన్నైలో 10 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది. అనంత‌రం వ‌చ్చే నెల‌లో గోవా షెడ్యూల్ మొద‌లు కానుంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement