Tuesday, April 30, 2024

క‌రోనా విపత్తు స‌మ‌యంలోనూ రాజ‌కీయాలా – కెసిఆర్ ప్ర‌భుత్వానికి కిష‌న్ రెడ్డి చుర‌క‌లు..

హైదరాబాద్: క‌రోనా స‌మ‌యంలో శవాలతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి. హైద‌రాబాద్ లోని గాంధీ, కింగ్ కోఠి హాస్ప‌ట‌ల్స్ ను నేడు ఆయ‌న ప‌రిశీలించారు… అనంత‌రం ఆయా హాస్ప‌ట‌ల్స్ అధికారుల‌తో స‌మావేశ‌మై కొవిడ్ చికిత్స‌ సౌక‌ర్యాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.. అనంత‌రం ఆయ‌న మీడియ‌తో మాట్లాడుతూ, కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌పై వివక్ష చూపుతుంద‌నే రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యాల‌ను త‌ప్పు ప‌ట్టారు.. ఈ స‌మ‌యంలో కాస్తంతా ఘాటుగానే కిష‌న్ రెడ్డి స్పందిస్తూ, కరోనాతో ప్రజల ప్రాణాలు పోతోంటే రాజకీయాలు చేయటం తగదని టిఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి హిత‌వు ప‌లికారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాల సాయం చేస్తోందన్నారు. వరంగల్, కరీంనగర్‌లో సైతం ఆక్సిజన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో న‌మోద‌వుతోన్న‌ కేసులు, మరణాల లెక్క‌ల ప్ర‌కార‌మే రాష్ట్రానికి కేంద్ర స‌ర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని తెలిపారు. కర్ణాటక, ఒడిషాల నుంచి తెలంగాణకు 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరుగుతోందన్నారు. అలాగే, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని వివ‌రించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు 24 గంటలు (మూడు షిఫ్టుల్లో) కేంద్ర ప్ర‌భుత్వం ఉత్పత్తిని ప్రారంభించిందని గుర్తు చేశారు. వ్యాక్సిన్ ధరలను కేంద్రం నిర్ణయించదని, త‌యారీ సంస్థ‌లకే ధ‌ర‌ల నిర్ణ‌య అధికారం ఉంటుంద‌ని పేర్కొన్నారు… టీకా ధ‌ర‌ల విష‌యంలో టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న వాద‌న‌లో వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement