Tuesday, April 30, 2024

వండర్ లా పార్క్స్‌లో ఉచిత టిక్కెట్‌తో మీ బర్త్ డేను ఉత్సాహంగా జరుపుకోండి!

హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్‌లతో మాన్‌సూన్‌ను వేడుక చేస్తుంది. వండర్ లా తమ సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకువచ్చింది. తమ పుట్టినరోజులు జరుపుకునే వ్యక్తులు తమ పుట్టినరోజుకు 5 రోజుల ముందు లేదా 5 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా వండర్ లా కి ఉచిత పార్క్ ఎంట్రీ టిక్కెట్ ని పొందవచ్చు. ఈ ఆఫర్ వండర్ లా బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలోని మూడు పార్కులకు వర్తిస్తుంది. అతిథులు తమ పుట్టినరోజున వండర్ లా ఉల్లాసకరమైన రైడ్‌లు, ఆకర్షణల థ్రిల్‌ను పొందవచ్చు, అదనపు ప్రోత్సాహకాలతో ఆనందించవచ్చు.

ఈ కార్యక్రమం గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ… తమ థ్రిల్లింగ్ ట్రైఫెక్టా ఆఫర్‌లతో వండర్ లా అద్భుతాన్ని కనుగొనాలన్నారు. ఉచిత టిక్కెట్‌తో మీ పుట్టినరోజును స్టైల్‌గా జరుపుకోండన్నారు. ఓపెన్ ఎయిర్ రెయిన్ డాన్స్ తో మాన్సూన్ బీట్‌లకు వూగిపోండని, 25శాతం తగ్గింపుతో బుధవారాలను మర్చిపోలేనివిగా మార్చుకోండని అన్నారు. వండర్ లా లో చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అన్నారు. వండర్ లా తమ సందర్శకులను ఆన్‌లైన్ పోర్టల్ బుకింగ్. వండర్ లా.కమ్ ద్వారా ఎంట్రీ టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement