Tuesday, April 30, 2024

సిరీస్‌ ఏ ఫండింగ్‌లో 15 మిలియన్‌ డాలర్లను సమీకరించిన భాన్జు

హైదరాబాద్ సంస్థ అయిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్‌) అభ్యాస వేదిక భాన్జును 2020లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ (హ్యూమన్‌) కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ 15 మిలియన్‌ డాలర్లను సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా సమీకరించినట్లు వెల్లడించారు. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ, ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించింది. ఈ రౌండ్‌లో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ బీ క్యాపిటల్‌ సైతం పెట్టుబడులు పెట్టింది. ఈ సమీకరించిన నిధులను తమ సాంకేతిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంతో పాటుగా అసాధారణ విద్యార్ధి అభ్యాస అనుభవాలను సృష్టించేందుకు, మరింత ఆసక్తికరంగా, ఫలితాలను లక్ష్యంగా చేసుకున్నకంటెంట్‌తో తమ గణిత పాఠ్యాంశాలు (మ్యాథ్‌ కరిక్యులమ్‌)ను బలోపేతం చేసేందుకు భాన్జు ను వినియోగించనుంది.

భాన్జు వ్యవస్థాపకులు అండ్ సీఈవో నీలకంఠ భాను. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందారు. ఈ ఫండింగ్‌ గురించి వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్ అండ్ భాన్జు సీఈఓ నీలకంఠ భాను మాట్లాడుతూ… సరైన అభ్యాస పద్ధతులతో గణితాన్ని అభ్యసించే సామర్థ్యం మన దేశంలో ప్రతి చిన్నారికీ ఉందని తాను నమ్ముతున్నానన్నారు. తన గణిత పాఠ్యాంశాలు, విద్యార్థులకు గణితమంటే ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటుగా సైన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి రంగాల్లో కెరీర్‌లను ఎంచుకునేలా వారికి స్ఫూర్తినందిస్తుందన్నారు. భారతదేశంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్‌ నుంచి శకుంతల దేవి వరకూ గణిత మేధావులెందరో ఉన్నారన్నారు. భాన్జు గణిత కోర్సులతో, ప్రతి విద్యార్థి సరైన మార్గంలో గణితం అభ్యసించడం ప్రారంభించడం మాత్రమే కాదు, ఆ గణితాన్ని అభిమానిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement