Sunday, May 5, 2024

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జ్యోతరావు పూలే : లోకేష్ కుమార్

భారతీయ సామాజిక కార్యకర్త, కుల రహిత సమాజానికి కృషి చేసిన సంఘ సంస్కర్తగా, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మ‌హాత్మా జ్యోతరావు పూలే అని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్. లోకేష్ కుమార్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మహాత్మా జ్యోతి రావు పూలే 196 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆయ‌న‌ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ… చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడుగా సమాజ అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో విద్య ఎంతో అవసరమని మహిళల విద్య పట్ల ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని కొనియాడారు. స్వార్థం కోసం కాకుండా లాభాపేక్ష లేకుండా భారత దేశంలో సేవ చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన మనందరికీ ఆదర్శ ప్రాయుడన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తో పాటుగా అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ఇంజనీరింగ్ ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ లు విజయలక్ష్మి, సరోజ కృష్ణ, సిపిఆర్ఓ మహమ్మద్ ముర్తుజా మహాత్మా, ఎంటమాలజి అధికారి రాంబాబు, మహాత్మా జ్యోతరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ ఓ లు పద్మ, జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement