Saturday, May 4, 2024

పరమేశ్వరుని పరిపూర్ణ అవతారమే కాలభైరవుడు

కాశీ క్షేత్రం వెళ్లిన వారు ఆ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామిని దర్శించటం పరిపాటి. అలాంటి కాలభైరవుడు- అసితాం గ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైర వు డూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ… ఇలా ఎన్నో రూపాల్ని ధరించిన కాలభైరవు డుని ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకుల విశ్వాసం.
కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తా రు. బ్ర#హ్మ విష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు దుష్టశిక్షకుడి గా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నా డు. కాశీ విశ్వనాథస్వామి కొలువై యున్న వారణాసికి కాలభైరవుడే క్షేత్ర పాలకుడు.
”భైరవ: పూర్ణ రూపోహ శంకరస్య పరాత్మన:
మూఢాస్తంవైనజానంతి మోహతాశ్శివమాయయా”
అని పేర్కొనబడింది శతరుద్రసంహతంలో. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవు డిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవ క్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోము. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు పరిపూర్ణత సాధించిన ఆధ్యాత్మికవేత్తలు. ”పరమశివుడు భక్తుల్ని ఓ రకమైన మాయలో పడేస్తాడట. దీనితో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమి స్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారో గ్యాలు సిద్ధిస్తాయనీ మంత్ర శాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం తోపాటు ఉజ్జయిని- ఇంకా దేశంలో అనేక ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
కాలభైరవుడు వృత్తాంతం
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్త కు మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు ఆ మహర్షులు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అయితే సృష్టికర్త బ్రహ్మదేవుని చుట్టూ ఓ మాయా పొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో బ్రహ్మ మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. అంతట బ్రహ్మ వారితో ‘మహర్షులారా! పరమతత్వం గురించి వేరే చెప్పేదే ముంది?
నేనే ఆ మహాతత్వాన్ని!
స్వయంభువును నేను!
విధాతను నేను!
సృష్టి స్థితి లయ కారకుడినీ నేను!
మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్భాలు పలి కాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొ ర కమ్మేసింది. ‘కాదుకాదు… నేనే గొప్ప’ అంటూ విష్ణు దేవుడు కూ డా బ్రహ్మతో వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ”’యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే” – సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్న వాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వ రుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వ రుడని నిర్ధారించింది. అంతలోనే… కోటికాంతుల దివ్యతేజస్సు తో ముక్కంటి ప్రత్య క్షం అయ్యా డు.

ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో భృకుటి ముడిపడింది. ఆ భ్రుకుటిలోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడ న్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యా డు. కాలభైరవుడికి ఆ సమయంలో కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నా డు.
దీంతో, నాగ భూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మ కపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు… కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని కపాలం ఊడిపడిన ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైం ది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురు గా కాలభైరవుడు కొలువు దీరాడు. స్థానికులు ‘లాట్‌బిభైరవ’ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసం లోని కృష్ణపక్ష అష్టమినే… కాలాష్టమి గా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైెరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైెరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.
పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకో వడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథు డి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించు కుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మణికర్ణికా ఘాట్‌ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్‌ బాబాగా (శ్మశాన) కొలుస్తారు.
కాశీ విశ్వనాథుని దర్శనంకోసం వెళ్లిన వారెవరు కాలభైరవ స్వామిని దర్శించుకోకుండా వుండరు. ఒకవేళ తెలిసిన వారు తెలియనివారికి చెప్పి మరీ ఆ క్షేత్రపాలకుని దర్శనం చేసుకోమని చెప్పటం ఒక ధర్మంగా పు ణ్యంగా భావించటం గొప్ప విషయం.

  • చలాది పూర్ణచంద్రరావు
    9491545699
Advertisement

తాజా వార్తలు

Advertisement