Thursday, April 25, 2024

రాష్ట్రం కోసం జగన్‌ గ్యారేజీలో పనిచేస్తా: కొడాలి నాని

పార్టీ, రాష్ట్రం కోసం జగన్‌ గ్యారేజీలో పనిచేస్తామని తాజా మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పడిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. మంత్రి పదవులు రాకపోవడంతో అనుచరుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ త్వరలోనే సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి క్యాబినేట్‌లో తమకు చోటు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జగన్‌ వెంట సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర, పార్టీ భవిష్యత్‌ కోసం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుంచి తమను అన్ని విధాల సముచిత గౌరవం ఇచ్చారని కొడాలి నాని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement