Wednesday, September 20, 2023

ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్, ఏప్రిల్ 8 (ప్ర‌భ న్యూస్) : వేసవికాలంలో ప్రజలకు, దాహార్తిని తీర్చడం కోసం స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని టూరిజం మాజీ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఐవీఎఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా కోరారు. హైదరాబాద్ లోని ఉప్పల్ రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి, రోజు రోజుకు ఎండ తీవ్రత బాగా పెరగడం వలన ప్రజలు వేసవి తాపానికి, వేడిమికి గురవుతున్నారన్నారు. వేసవికాలంలో అనేక అవసరాల కోసం బయటికి వచ్చే ప్రజలు..ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి ఇక్కట్లను గుర్తించి జన సంచార ప్రాంతాల్లో వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరమైంద‌న్నారు. అదేవిధంగా ప్రజలు, ప్రయాణికులు బయటికి వచ్చినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండయ్య గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, రమేష్ గుప్తా, శ్రవన్ కుమార్, బోనగిరి శ్రీనివాస్, కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి, సాంబ శివరావు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement