Tuesday, May 7, 2024

HYD: వ్యాయామంతో ఆరోగ్యవంతమైన జీవితం… ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్: వ్యాయామంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించవచ్చని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవీఎఫ్‌ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ లోని నల్ల పోచమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా, ట్రై కలర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిబిరం అనూహ్య స్పందనతో మద్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. ఇందులో చాలా మంది ఉచిత ఆరోగ్య పరీక్షలు, వైద్యసేవలు వినియోగించుకున్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి రోగనిర్ధారణ వైద్యబృందంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.

అనంత‌రం ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో షుగర్, బి.పి.థైరాయిడ్ వంటి జబ్బులు ఎక్కువగా ప్రబలుతున్నాయన్నారు. ఈ రోజుల్లో ఖరీదైన వైద్యపరీక్షలు, వైద్యసేవలు ఉచితంగా అందజేసిన ట్రై కలర్ హాస్పిటల్ వారిని, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారిని లబ్ధిదారులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభు పాండయ్య గుప్తా, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రమేష్ గుప్తా, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాసులు గుప్తా, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ యూత్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేష్ గుప్తా, ట్రెజరర్ బోనగిరి శ్రవన్ గుప్తా, ఉప ట్రెజ‌రర్ వూరే నగేష్ గుప్తా, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా సభ్యులు, నాయకులు, వైద్య సిబ్బంది, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement