Wednesday, May 15, 2024

TS | ముచ్చటగా హ్యాట్రిక్ గెలుపు ఖాయం.. ధీమా వ్యక్తం చేసిన మంత్రి తలసాని

ఖైరాతాబాద్, (ప్రభన్యూస్): 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపెట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, సీఎం కెసిఆర్ నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించామని అన్నారు.

చరిత్రలో ఎన్నడు లేని విధంగా కొన్ని వందల కోట్ల రూపాయల నిధులతో సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా సగటు మనిషి బ‌తకడానికి, రైతు వ్యవసాయానికి, వ్యాపారానికి ఇలా ఎన్నో వర్గాల ప్రజలు జీవనోపాధికి కావాల్సిన కనీస వసతులైన కరెంట్, నీరు విషయాలలో నిరంతర ఇరువై నాలుగు గంటల కరెంట్ తో పాటు పుష్కలంగా నీరు అందించిన ఘనత సీఎం కెసిఆర్ ది అని అన్నారు.

సనత్ నగర్ నియోజకవర్గంలో సీసీ రోడ్ లు , డ్రైనీజ్ వ్యవస్థ మెరుగు పరచడం, మంచి నీటి వసతి, స్ట్రీట్ లైట్స్, ముల్టీ పర్పస్ ఫంక్టన్ హాల్స్ , ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రులు, సకల వసతులతో వైకుంఠ ధామాలు, ప్రజా నివాసాలపై ఎన్నో ఏళ్లుగా ఉండిపోయిన హై టెన్షన్ వైర్ల తొలగొంపు, ఆలయాల అభివృద్ధికి కోట్ల రూపాయల తోడ్పాటు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.

- Advertisement -

అలాగే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వివిధ బాషలు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని కూడా తమ బిడ్డలుగానే కండ్లలో పెట్టుకొని చూసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. వారి అభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ అవసరమైన సహకారం అందిస్తూ వస్తుందని చెప్పారు. నిరంతరం ప్రజల మద్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కోసం పని చేస్తున్న బిఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు.

డెబ్భై వేల డబులు బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ :

ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఇప్పటికే డెబ్భై వేల డబులు బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటె వారికి రాలేదని నిరాశపడవద్దని అన్నారు. అవసరమైతే రానున్నరోజులలో ( మళ్ళీ అధికారంలోకి రాగానే ) మరో లక్ష డబులు బెడ్ రూమ్ లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందరికి అందేలా చూస్తామన్నారు.

నవంబర్ 8న మంత్రి తలసాని నామినేషన్ :

వచ్చే నెల నవంబర్ 8న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ల నుండి భారీ ర్యాలీతో ఊరేగింపుగా బయలు దేరి బన్సీలాల్ పెట్ లోని జబ్బార్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. అలాగే ఈ నెల 16న నెక్లస్ రోడ్ లోని జలవిహార్ లో జనరల్ బాడీ మీటింగ్ తో పాటు, ఈ నెల 18న బూత్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement