Sunday, May 12, 2024

తెలంగాణ‌లో కొత్త‌గా 8061 క‌రోనా పాజిటివ్స్ – 56 డెత్స్..

హైద‌రాబాద్ – క‌రోనా సెకండ్ వేవ్ తాకిడికి తెలంగాణ అల్లాడిపోతున్న‌ది.. నిత్యం రోగుల సంఖ్య పెరిగిపోతున్న‌ది.. దానితో పాటే మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త‌గా 8061 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా భారీన ప‌డిన వారి సంఖ్య 4,19, 966కి చేరింది.. ఇక మంగ‌ళ‌వారం నాడు రాష్ట్రంలో 52 మంది మ‌ర‌ణించారు.. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 2150కి చేరింది.. కాగా నిన్న మొత్తం 5093 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు..ఇక మంగ‌ళ‌వారం నాడు అత్య‌ధికంగా హైద‌రాబాద్ లో 1508, రంగారెడ్డిలో 514, మేడ్చేల్ మ‌ల్కాజిగిరిలో 673 కేసులు న‌మోద‌య్యాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement