Friday, May 3, 2024

కౌన్సిలింగ్‌తో సేవలు అందిస్తాం..

సికింద్రాబాద్ : ఎలాంటి లాభాపేక్ష లేకుండా జ్యోతిష్యాస్త్రం ద్వారా ప్రజలకు వాస్తవాన్ని తెలిపి, అవసరమైన సలహలు, సూచనలు కౌన్సిలింగ్‌తో సేవలు అందిస్తామని ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ రిటైర్డ్‌ అధికారి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రాలజీ సైన్స్‌ (ఐసీఏఎస్‌ ) కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎం. ఆంజనేయులు అన్నారు. సికింద్రాబాద్‌ బెల్సన్‌ తాజ్‌ హోటల్‌లో ఐసీఏఎస్‌ సికింద్రాబాద్‌ చాప్టర్‌-5 (అమీర్‌పేట్‌) చైర్‌పర్సన్‌ వాణి వినోద్‌ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐసీఏఎస్‌లో వివిధ జ్యోతిష్యాస్త్ర కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు చాప్టర్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలతో సందడిగా మారిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ఆయన మాట్లాడుతూ స్ధానిక బాషాల్లో ఎంతో మందికి జ్యోతిష్యాస్త్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 1984లో బీవీ రామన్‌ అనే వ్యక్తి ఈ సంస్ధను స్ధాపించరాన్నారు. ప్రస్తుతం తాము ఖగోళశాస్త్రం, జ్యోతిష్యాస్త్రం, గణిత శాస్త్రంతో కూడిన శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్రతి సెమిస్టర్‌కు 1500 బయటకు వస్తున్నారని, ఇప్పటి వరకు 20వేల మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఎస్‌ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, డిప్యూటీ సీఓఈ రాజేంద్రన్‌, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, నాడీ అస్ట్రాలజర్‌ రాంప్రసాద్‌, కేధార్‌నాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement