Friday, April 26, 2024

అభివృద్ది పనులపై ఆరా..

చాంద్రాయణగుట్ట : పెండింగ్‌లో ఉన్నవిభాగాల అభివృద్ది పనులను వేగంగా చేపటాలని జిహేచ్‌ఎంసి. సౌత్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ నామా. సామ్రాట్‌ ఆశోక్‌ అధికారులను అదేశించారు. చెత్తకుండీల తొలగింపు, పారిశుధ్య నిర్వహాణ, మూత్రశాల నిర్మాణ పనులు, జనన మరణం ధ్రవీకరణ పత్రాలు, రోడ్డు విస్తరణ అభివృద్ది నిర్వహాణ పనుల పై చాంద్రాయణగుట్ట నిరికి ఫూల్‌ బాగ్‌లోని జోనల్‌ కమిషనర్‌ కార్యలయంలో డి.సి.లు, అధికారులతో సమీక్ష- సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌ పరిధిలోని అన్ని సర్కిళ్లలో చెత్త పారిశుధ్య రహిత నగరంగా మార్చేందుకు చర్యలు చేపటాలని అయన అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెత్త కుండిలను తొలగించామని అయన తెలిపారు. అయితే గుర్తించిన ప్రాంతాలలో నూతన మూత్రశాలలు ఏర్పాటు చేస్తూన్నామన్నారు. అంతేకాక ప్రైవేట్‌ ఏజేన్సిల సహాకరంతో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన టాయిలెట్ పనితీరును క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌లతో ఎప్పటికేప్పడు పర్యవేక్షిస్తూన్నామన్నారు. అదేవిధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జాప్యంలేకుండా పరిశీంచే జారీ చేయాలన్నారు. అలాగే చాంద్రాయణగుట్ట నుండి కందికల్‌ గేట్‌ ఛత్రినాక వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని అయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సౌత్‌ జోన్‌ ఇంజినియరింగ్‌ విభాగం ఎస్‌.ఈ నర్సింగ్‌ రావు, మాలక్‌పేట్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్‌, రాజేంధర్‌నగర్‌ , సర్కిల్‌- డిప్యూటి కమిషనర్లు రజనీ, కాంత్‌ రెడ్డి, కే. అలివేలు, మంగతాయారు, రీచా గుప్త, ఎస్‌.ఎన్‌. సూర్యకుమార్‌, డ. జగన్‌, ఆర్బన్‌ బయోడైవర్సి డీప్యూటి కడైరెక్టర్‌ నాగిరెడ్డి, నరేంధర్‌ గౌడ్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏ.సి.పి. అబ్దుల్‌ ఖాదర్‌ గిరిరాజ్‌, ఏం.హేచ్‌.ఓలు డాక్టర్‌. కౌవి. శివప్రసాద్‌, డాక్టర్‌. పల్వాన్‌ కుమార్‌, డాక్టర్‌. పద్మా, జోనల్‌ కమిషనకర్‌ సి.సి. గుంటు. గిరి బాబు, ఏ.ఈలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement