Sunday, April 28, 2024

TS : జూలో 125ఏళ్ల వ‌య‌సున్న తాబేలు మృతి…

125ఏళ్ల వ‌య‌సున్న ఓ మ‌గ తాబేలు మృతి చెందింది. ఈ గాలాపాగోస్ జెయింట్ తాబేలును 1963లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి హైద‌రాబాద్‌ జూ పార్క్‌కు తరలించారు. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్‌తో గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృతి చెందినట్లు తేలింది.

అయితే, ఇది కొంతకాలంగా అనారోగ్యంతో ఉందని జూ పార్క్ అధికారులు తెలిపారు. పలు అవయవాలు విఫలం కావడంతో తాబేలు మరణించినట్టు పోస్ట్‌మార్టంలో తేలిందన్నారు. పరిశోధనల కోసం తాబేలు శాంపిల్స్‌ను రాజేంద్రనగర్‌లోని వీబీఆర్ఐ అండ్ వెటర్నరీ కాలేజీకి పంపామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement