Friday, May 3, 2024

అనురాగ్ కళాశాలలో భారీ చోరీ…రూ.10లక్షల నగదు అపహరణ

అనంతగిరి ఆగస్టు 01(ప్రభ న్యూస్): మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటుచేసుకుంది. సుమారు పది లక్షల రూపాయల వరకు నగదును దొంగలించబడినట్లు తెలుస్తుంది. దొంగతనం చేసిన వారు గ్లాస్ అద్దాలను పగలగొట్టి డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో లాకర్ ను కట్ చేసి మరి నగదును దొంగలించారు.

ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో నిఘా ఉండే కళాశాలలో దొంగతనం చోటు చేసుకోవడం చర్చినియాంసమైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించి విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణలో భాగంగా జిల్లా ఎస్పీ సైతం కళాశాలకు రానున్నట్లుగా తెలుస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement