Monday, May 6, 2024

Suicide: షాపింగ్ మాల్ నుంచి దూకి హౌజ్ కీప‌ర్ ఆత్మ‌హ‌త్య …

కూకట్‌పల్లి: చెన్నై సిల్క్స్ షాపింగ్‌మాల్ బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి ఉద‌యం జ‌రిగింది. కాగా , రమణమ్మ(50) చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్‌లో హౌజ్ కీపర్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోజు వారి మాదిరిగానే విధులకు హాజరైన రమణమ్మ రెండవ అంతస్తులో పని చేసేందుకు వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృత దేహాన్ని గాంధీకి తరలించారు. రమణమ్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement