Monday, April 29, 2024

Holiday Date Change – ద‌స‌రా 24 కాదు 23నే… సెల‌వును మార్చిన తెలంగాణ స‌ర్కార్

హైద‌రాబాద్ – దసరా సెలవును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్‌ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ప్రకటించిన సెలవును సైతం కొనసాగించింది.

ఇదిలా ఉండగా.. పాఠశాల విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్ఛిక సెలవు ఇచ్చింది.

పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్‌ కళాశాలలకు కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా.. 26న తెరచుకోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement