Saturday, May 4, 2024

Weather: రేప‌టి నుంచి ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌

తెలంగాణ‌లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే చాన్స్‌ ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఉమ్మ‌డి జిల్లాలైన‌ ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌తో పాటు నిజామాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ నెల 19నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్న‌ట్టు అధికారులు తెలిపారు.

ఈ జిల్లాల‌తో పాటు మ‌రికొన్ని జిల్లాల్లోనూ 22వ తేదీ దాకా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సంచాల‌కులు తెలిపారు. హైద‌రాబాద్ సిటీలో ఆకాశం మేఘావృత‌మై, సాధార‌ణం నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌న్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement