Sunday, May 19, 2024

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం..నిండుకుండ‌ల్లా ప్రాజెక్ట్ లు…

ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో నిన్న ఉదయం మొదలైన వర్షం రాత్రి తీవ్ర రూపాన్ని దాల్చింది. ఆదివారం పగటివేళ‌ బాల్కొండ, కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం నుండి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఇక సోమ‌వారం కూడా వ‌ర్షం కొన‌సాగుతున్న‌ది.. జూన్ మాసంలో వర్షం మనపై కన్నెత్తి కూడా చూడలేదు. జూలైలో వర్షం ఉగ్రరూపాన్ని దాల్చింది. నిజాంబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్, బాల్కొండ మండలాల్లో ప్రతి భారీ వర్షం కురిసింది. జూలైలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షం బాల్కొండ నియోజకవర్గంలో 46 సెంటీమీటర్లు నమోదు అయింది. బాల్కొండలో పడిన వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లు ఎన్నో నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. నాలుగు రోజులపాటు కొన్ని మండలాలకు ప్రయాణ సౌకర్యాలు కూడా నిలిచిపోయాయి. బాల్కొండ నియోజకవర్గానికి శాసనసభ్యులు ప్రాతినిధ్య వహిస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వారం రోజులపాటు తన నియోజకవర్గంలోని మకాం వేసి పరిస్థితులను చక్కబెట్టారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన తాను అండగా ఉంటానని ప్రభుత్వం తరఫున నష్టపరిహారము అందిస్తానని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆనాడు వేముల ప్రజలకు భరోసా ఇచ్చారు.


నిజాంబాద్ జిల్లాకు వరప్రదాయని అయినటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు దేశంలో వరద ముప్పుకు గురై ప్రజలు ఇబ్బందులు గురైతే కానీ నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరదు అని ప్రజలు ప్రతిసారి చర్చించుకుంటూ ఉంటారు. తొలకరి ఆరంభం నుండి జూన్ మాసంలో మేఘాలు వచ్చాయి కానీ రైతులపై కనికరించకపోవడంతో పంటల సాగుపై రైతులు తీవ్ర ఆందోళన చెందారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో ప్రాజెక్టులోని నీటిని కాలువల ద్వారా పంటల సాగు విడుదల చేసేందుకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. నిజాంబాద్ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజాంసాగర్ నీరు విడుదల చేయడంతో కొంతమంది వారి నార్లు పోసుకోవడం మరి కొంతమంది ముందస్తుగా వరి నార్ల సిద్ధం చేసుకున్న రైతన్నలు వరి నాట్లు జూలైలోనే పూర్తి చేసుకున్నారు. ఆగస్టులో వర్షాలు పడకపోయినప్పటికీ నిజాంసాగర్ నిండుకుండలా ఉండడంతో ఆయకట్టు రైతులకు నిజాంసాగర్ నీటినిv విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పంటలు కూడా కళ కళ లాడుతూ ఉన్నాయి. జూలైలో వర్షం పడినప్పటికీ నిజాంసాగర్ నీరు విడుదల కావడం మరోపక్క కరెంటుకు కొదవ లేకపోవడంతో అవసరమైన రైతులు తమ బోర్ల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు.

నేడు భారీ వర్షం .. మెట్ట పంట రైతులు ఆనందం

ఆదివారం నుండి కురుస్తున్న వర్షాలకు మెట్ట పంట రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద లేని ప్రాంతాల్లో ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో వర్షం పై ఆధారపడి ఎక్కువగా మెట్ట పంటలను సాగు చేస్తూ ఉంటారు. సోయా, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను ఎక్కువగా జుక్కల్ ప్రాంతంలో రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. 20 రోజులపాటు వర్షం పడకపోవడంతో కొంతవరకు రైతులు ఆందోళన చెందారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయం కల్లా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో కొన్ని ప్రాంతాల్లో కొంత నష్టం రైతులకు వాటిల్లుతుంది. నిజాంబాద్ జిల్లాలో వరి పంటను ముందస్తుగా సాగు చేయడంతో ప్రస్తుతం కొన్నిచోట్ల వారి పంట పొట్ట దశలో ఉండడం భారీ వర్షం పడడంతో పొట్ట పగిలి గింజలు పాలు పోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భారీ వర్షం రైతులకు నష్టం కన్నా లాభమేనని చెప్పుకోవచ్చు. భారీ వర్షం పడడంతో 15 రోజులపాటు రైతులకు సాగునీరుతో పని లేకుండా పోయింది. నిజాంసాగర్ నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుతం నిజాంసాగర్ నిండుకుండలా తోనికి సలాడుతుంది. రాబోయే రబీ పంటకు సాగునీటికి కరువు లేకుండా పోయింది. రెండో పంట సాగు చేసుకోవచ్చన్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

శ్రీరామ్ సాగర్ కు వరద ఉప్పు

- Advertisement -

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై ప్రాంతాల్లో ఆదివారం నుండి భారీ వర్షాలు పడటంతో ప్రాజెక్టులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజాంబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ ఆర్మూర్ బాల్కొండ ప్రాంతాల రైతులకు మాత్రమే సాగునీరు పంటలకు అందుతుంది. కరీంనగర్ వరంగల్ జిల్లాలకు శ్రీరామ్ సాగర్ వరప్రదాయనిగా భావించవచ్చు. పై ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయని దిగువ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు అప్రమత్తమై రైతులకు వరద నీటిపై అవగాహన కల్పించాలని అధికారులు కోరుతున్నారు.

భారీ వర్షంతో జుక్కల్ అతలాకుతలం

రెండు రోజుల నుండి ఎడతెరపి కురుస్తున్న వర్షానికి జుక్కల్ మండలం అతులకుతలంగా మారింది నేటి తెల్లవారుజామున నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, జుక్కల్ నుండి జుక్కల్ చౌరస్తా కు వెళ్లే ప్రాదాన రహదారి కాలేజ్ వద్ద నూతన వంతెన నిర్మాణం కొనసాగుతుండటంతో తాత్కాలిక రహదారి ఏర్పాటు చెయ్యగా అది కొట్టుకపోవటం తో రవాణా సౌకర్యం నిలిచిపోయింది,జుక్కల్ కి రావాల్సి ఉన్న,పోవాల్సిన ఉన్న దాదాపు 10 కి,మీ,మేర తిరిగి డోన్ గాం దోస్ పల్లి,మీదుగా లేదా ఎక్లారా,నాగల్ గాం మీదుగా రావాల్సి ఉంది,జుక్కల్ లో పంటపొలలకు వర్షం అవసరం ఉండగా భారీ వర్షం వల్ల కొందరి రైతుల పొలాలు వర్షంతో చెరువులను తలపిస్తున్న,భారీ వర్షాలకు వ్యాపారస్తులు,ప్రజలు బయట రాక పోవటంతో ప్రధాన విధులు బోసిపోయాయి, ఆయా గ్రామాలలో పురాతన ఇండ్లు కూడా కూలిపోయినట్టు సమాచారం అందుతుంది,వర్షం తో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement