Sunday, April 28, 2024

కృష్ణా నదికి కొనసాగుతున్న వరద

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ కు వరద వస్తోంది. అధికారులు ప్రాజెక్ట్ 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 3,97,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,85,527 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 6.823 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి 4,41,914 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 4,35,525 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉన్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.80 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. డ్యామ్‌లో ప్రస్తుతం 208.7210 టీఎంసీలు నిల్వ ఉన్నది. డ్యామ్‌ పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement