Thursday, May 16, 2024

AIG చైర్మన్‌ను అభినందించిన మంత్రి హరీష్

హైదరాబాద్ లోని AIG ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డిని అభినందిస్తూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ ప్రకటించిన ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఎంపికైన ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ కు చెందిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా దశాబ్దాలుగా వైద్య రంగంలో అనేక సేవలందిస్తున్న డాక్టర్‌.నాగేశ్వర్‌రెడ్డికి ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు కావడం గర్వకారణం అని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement