Thursday, November 14, 2024

Harish Rao – పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

సిద్ధిపేట ప్రతినిధి :- 27 ఆగస్టు 2023:కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ హరీశ్ రావు చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, సద్దితిన్న రేవు తలవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కోరారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట రూరల్ మండలంలోని రాంపూర్ రూ.10 లక్షలు రెడ్డి కమ్యూనిటీ, బండచర్లపల్లి రూ.5 లక్షలు విలేజ్ ఫంక్షన్ హాల్, చిన్నగుండవెళ్లి రూ.10 లక్షలు ముదిరాజ్ కమ్యూనిటీ, ఇర్కోడ్ రూ.10 లక్షలు విలేజ్ ఫంక్షన్ హాల్, తొర్నాల రూ.3 లక్షలు రజక కమ్యూనిటీ హాల్, తొర్నాల రూ.6.50 లక్షలు మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్, అలాగే నంగునూరు మండలం కొండంరాజ్ పల్లి రూ.15 లక్షలు విలేజ్ ఫంక్షన్ హాల్ భవన నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసి ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు, కులసంఘ బాధ్యులకు మొత్తం కలుపుకుని రూ.59.50 లక్షలప్రొసీడింగ్ కాపీలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement