Saturday, October 12, 2024

Great Robbery – అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ … రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు ,వజ్రాభరణాలు స్వాధీనం

వరంగల్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం ఐదు అపార్ట్‌మెంట్లలో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టించారు. యూపీకి చెందిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువ చేసే రెండు కిలోల 380 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు, 5.20 లక్షల విలువ చేసే 104 కిలోల గంజాయి, 5 వేల నగదు, ఒక పిస్టల్, 5 బులెట్స్, 2 వాకీ టాకీలు, కారు, నాలుగు నకిలీ ఆధార్ కార్డ్స్ స్వాధీనం చేశారు.

కరుడుగట్టిన ఈ దొంగల ముఠా నాలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. చోరీకి పాల్పడిన 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో వీరిని పట్టుకున్నట్లు చెప్పారు. కారు నెంబర్, సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను వెంబడించామన్నారు. దొంగలను పట్టుకోవడంలో టోల్ గేట్లు కీలకంగా మారినట్లు చెప్పారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. ఏపీ పోలీసుల సహాయంతో ఛేజ్ చేసి కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టుబడ్డ దొంగలపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement