Sunday, May 5, 2024

తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమమూ నా బాథ్య‌తే – గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై..

పుదుచ్చేరి – పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్ భవన్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించిన వివిధ విషయాలపై సమగ్రంగా సమీక్ష నిర్వ‌హించారు. సెక్రటరి టు గవర్నర్ కె. సురేంద్ర మోహన్ పుదుచ్చేరి నుండి గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ నుండి గవర్నర్ సలహాదారులు, జాయింట్ సెక్రటరీలు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కి హాజ‌రయ్యారు.. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాటాడుతూ “నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటికీ, తెలంగాణకు సంబంధించిన విషయాలపై, ఇతర డెవలప్ మెంట్స్ పై నేను తెలుసుకుంటూనే ఉన్నాను” అని తెలిపారు. అలాగే “తెలంగాణ ప్రజల సంక్షేమం, బాగోగులు నాకు అత్యంత ప్రాధాన్యత. నేను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల అణుక్షణం నా తపన అలానే ఉంది”. “నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అవసరమైన విషయాలు నా దృష్టికి తీసుకురండి” అని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement