Friday, May 17, 2024

ఇంగ్లిష్ మీడియంలోకి మారని సర్కారు స్కూళ్లు.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే..

హౖౖెదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగు మీడియం తరగతులకు సమాంతరగా ఇంగ్లీష్‌ మీడియంలోకి మారాల్సిన ప్రభుత్వ బడులు 180 వరకు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖలోని ఓ అధికారి తెలిపారు. ఇందులో 80వరకు కేవలం పదో తరగతికి సంబంధించిన ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్పు చేయాల్సిన సర్కారు బడులే ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టడం ఎందుకని… ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్‌ మీడియం చదువును ప్రభుత్వ బడులు అందిస్తున్నాయి. పైగా ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌ లాంటివి ప్రభుత్వమే అందిస్తుండడంతో ప్రైవేట్‌ స్కూళ్లను మాన్పించి తమ పిల్లలను సర్కారు బడులకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు.

అయితే తల్లిదండ్రు ఆకాంక్షలకు అను గుణంగా మీడియం మార్పునకు సర్కారు స్కూళ్లు నోచు కోవడంలేదు. జిల్లాల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించేందుకు అనేక పాఠశాలలు సిద్ధంగా ఉన్నా సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ అనుమతి వంటి కారణాలతో అప్‌గ్రెడేషన్‌లో జాప్యం జరుగుతోంది. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు చొరవ తీసుకొని ఇప్పటికే చాలా స్కూళ్లను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియానికి మార్పులు చేశారు. అందులో కొన్నింటికి మీడియం మార్పుపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement