Friday, May 17, 2024

ప్రమాదకర పరిస్థితుల్లో మంచూరు బ్రిడ్జి

వాల్మీకిపురం, ప్రభ న్యూస్ : మండలంలోని మంచూరు పాత మంచూరు మధ్య బాహుదా నది పై ఉన్న బ్రిడ్జి నీటి ప్రవాహానికి కోతకు గురై కొట్టుకుపోయె పరిస్థితి నెలకొంది. నీటి ప్రవాహం ఉధృతం కావడంతో బ్రిడ్జిపై ప్రమాదకర పరిస్థితిలో నీటి ప్రవాహం ఉన్న ఎటువంటి సూచిక బోర్డు పెట్టకపోవడంతో శోచనీయం. మంచూరు – పాత మంచూరు మధ్య గ్రామస్తులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement