Thursday, May 2, 2024

Good News – రూ.26వేల కోట్ల‌తో ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ – కిష‌న్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింద‌న్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం 350 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు తెలంగాణలోని చాలా జిల్లాలను కలుపుతుందన్నారు. రూ. 26వేల కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగందన్నారు. రూటు ఎలా ఉండాలనేదానికి 99 శాతం ఆమోదం లభించిందన్నారు. భూసేకరణ ఖర్చు 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించింది. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టు ఔటర్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు సర్వే త్వరలో మొదలుకానుంది. ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిది అని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు కు సమాంతరంగా ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. రింగ్‌ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌, ఔటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్‌ రింగ్‌ రైలు కనెక్టివిటీగా ఉంటుందన్నారు. అలాగే ఘ‌ట్ కేస‌ర్ – రాయగ‌ర్ మార్గం నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.. ఇక రాజ‌కీయాలు గురించి మాట్లాడుతూ, రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడి మార్పు ఉండ‌ద‌ని అన్నారు.. ప్ర‌స్తుతం బండి కొన‌సాగుతార‌ని పేర్కొన్నారు. అధ్య‌క్షుడి మార్పు కేవ‌లం ఊహ‌గానాల‌ని తేల్చి చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement