Thursday, May 9, 2024

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం .. 18 అంశాలకు ఆమోదం

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. మొట్ట మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం అయినందున సభ్యులు, అధికారుల పరిచయం కార్యక్రమం అయిన పిదప ఎన్నికైన సభ్యుల‌కు మేయర్ స్వాగతం పులుకుతూ పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కొవిడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కార‌ణంగా జాప్యం జరిగింది. తప్ప ఇతర కారణాలు ఏమి లేవని ఇక నుండి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్దేశించిన ప్రకారంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అత్యంత ప్రాముఖ్యత గల స్టాండింగ్ కమిటీ సమావేశం పాలసీ నిర్ణయాల కమిటీ కాబట్టి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని నగర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నగరాభివృద్ధికి అందరం కలిసి చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ….సభ్యులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణాలకు, నాలాల మరమ్మతుల పనులు చేపట్టేందుకు కావాల్సిన భూసేకరణలో కార్పొరేటర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ సందర్భంగా సభ్యులు ఎక్కువగా శానిటేషన్ పై చర్చించారు. శానిటేషన్ కార్పొరేటర్లతో అడిషనల్ కమిషనర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ తెలిపారు.


మొట్టమొదటి స్టాండింగ్ కమిటికీ 14 మంది సభ్యులు హాజరయ్యారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, చావని కార్పొరేటర్ ముహమ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, కుర్మగుడా కార్పొరేటర్ మహపరా, రియసత్ నగర్ మిర్జా ముస్తఫా బేగ్, పర్వీన్ సుల్తానా ఘన్సి బజార్, మందగిరి స్వామి కార్వాన్, బాత జాబీన్ విజయనగర, ఇ.విజయకుమార్ గౌడ్ అంబర్ పేట్, మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ షేక్ పేట్, సి.ఎన్.రెడ్డి రహమత్ నగర్, మందాడి శ్రీనివాసరావు కేపీహెచ్ బీ కాలనీ, వై.ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్, సామల హేమ, కుర్మా హేమలత కార్యదర్శి లక్ష్మి, ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దీన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, యస్ అర్ డీపీ చీఫ్ ఇంజనీర్ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, ప్రియాంకఅలా, జయరాజ్ కెన్నెడీ, విజయ లక్ష్మి సరోజ, జోనల్ కమిషనర్లు పంకజ, మమత, రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎంట మాలోజి చీఫ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement