Sunday, April 28, 2024

TS : గేట్లు తెరిచారుగా… మీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకోండి.. రేవంత్​కు​ ల‌క్ష్మ‌ణ్ చుర‌క‌లు

సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని మాట్లాడుతున్నారు.. ఆ తెరిచిన గేట్ లోంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు పోకుండా జాగ్రత్త పడాలని సెటైర్ వేశారు బిజెపి ఎంపి కె ల‌క్ష్మ‌ణ్.. జ‌గిత్యాల‌లో జ‌రిగిన విజ‌య సంక‌ల్ప స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, . దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మార్గం సుగమం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తాము అధికారాన్ని పడగొట్టబోమని., పడిపోతే నిలబెట్టేందుకు సహకరించబోమ‌ని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పూర్తిగా నేలమట్టం అయిపోయిందని ఇక ఆ పార్టీ పుంజుకోవాలంటే ఏదైనా అద్భుతం జరుగాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement