Sunday, April 28, 2024

National: ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై సుప్రీం డెడ్ లైన్….. ఎస్బీఐకి మ‌రోసారి అంక్షింత‌లు…

ఎలక్టోరల్‌ బాండ్ల విడుదలపై సుప్రీం కోర్టు తాజాగా మరోసారి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్టోరల్‌ బాండ్లపై నేడు విచారణ చేపట్టింది.
ఈ సంద‌ర్భంగా ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా.. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాల్ని బహిర్ఘతం చేయాలని స్పష్టం చేసింది.

- Advertisement -

దీంతో పాటు తమ వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది.

మొత్తం డేటా ఇస్తాం… న‌మ్మండి.
సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్‌ కోడ్‌ను సైతం ఎస్‌బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మేం ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్‌బీఐ తన వద్ద ఉంచుకోదు’ అని సాల్వే చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement