Tuesday, April 30, 2024

TS : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన…

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. కొద్దిరోజుల క్రితం హాజరు శాతం తక్కువ తో పాటు పరిమితికి మించి సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ డీటైన్ చేసింది. దీంతో విదార్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు.

- Advertisement -

దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను కాలేజీ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఆందోళనలు ఉదృతం కావడంతో కాలేజీ స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
విద్యార్థులకు మైనంపల్లి మద్దతు
మల్లారెడ్డి కాలేజీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సపోర్ట్ చేశారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement