Thursday, May 9, 2024

కేసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి అని ప్రజాసంఘాల జెఏసి  ఛైర్మన్ గజ్జెల కాంతం ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ లో మాట్లాడుతూ గుజరాత్ సిఎంగా ఉన్న మోడీ.. ప్రధాని అయితే తప్పు లేనిది కెసిఆర్ ప్రధాని అయితే తప్పేంటన్నారు. తెలుగువారైన పివి ప్రధాని అయ్యారని, కెసిఆర్ ప్రధాని కాబోతున్నరని జోష్యం చెప్పారు. కెసిఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా దళిత బందు, రైతు బంధు, కల్యాణ లక్ష్మిలు అమలవుతాయని, అందరికి సమన్యాయం జరుగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement