Friday, May 17, 2024

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్న‌య్య కిడ్నాప్..?

హైద‌రాబాద్ – తెలంగాణ ఉద్య‌మ‌కారుడు గాదె ఇన్న‌య్య గ‌త రాత్రి నుంచి క‌నిపించ‌డం లేదు.. కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నారాయణ గూడ ఏరియాలో గాదె ఇన్నయ్య కిడ్నాప్ చేసిన‌ట్లు స‌మాచారం.. కిడ్నాప్ చేసిన వ్య‌క్తులు తాము పోలీసుల‌మ‌ని చెప్పిన‌ట్లు ఇన్న‌య్య బంధువులు అంటున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి రాక‌పోవ‌డంతో గాదె ఇన్న‌య్య‌కు ప్రాణ‌హ‌ని జ‌ర‌గ‌వ‌చ్చని కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఈ కిడ్నాప్ గురించి పోలీసుల‌కు కుటుంబ స‌భ్యులు స‌మాచారం అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement