Friday, May 3, 2024

హైద‌రాబాద్ లో జి 20 స‌మావేశాలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా వచ్చే నెల 6, 7 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ‘గ్లోబల్‌ పార్ట్నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌’ పేరుతో ఈ సదస్సు జరుగనుంది. సదస్సుకు అన్ని జీ-20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు- ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరు కాను న్నారు. జీ-20 సదస్సులో భాగంగా- పలు వాణిజ్య సదస్సులు సైతం జరుగనున్నాయని విదేశాంగశాఖ అధికారి ముక్తేశ్‌ పరదేశి తెలిపారు. అలాగే మార్చి 28, 29 తేదీల్లో ఆంధ్రప్ర దేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశాలు జరుగ నున్నాయి. హైదరాబాద్‌ ప్రతిష్టను మరింతగా పెంచే జీ-20 కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేం దుకు అధికార యంత్రాంగం అన్ని కోనాల్లో భారీ ఏర్పాట్లు- చేస్తోంది.


ఈ ఏర్పాట్లకు సంబంధించి భద్రతా సమన్వయ కమిటీ- సమావేశం ఇటీవల డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్‌ పోలీసు అధికా రులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌డీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ ఇతర భద్రతా సంబంధిత విభాగాల అధికారులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిని కవర్‌ చేయడంతో పాటు-, ప్రపంచ జీడీపీలో 85శాతం, 75శాతం వాటా కలిగిన 29 దేశాలు జీ-20లో సభ్యులుగా ఉన్నాయి. జీ-20 దేశాల అధినేతల సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ఉండనుంది. ప్రపంచ వాణిజ్యం, ప్రధానమంత్రి నేతృ త్వంలో సెప్టెంబర్‌లో ఉంటు-ంది.
కాగా, ఈ సదస్సుకు ముందు దేశంలోని 56 నగరాల్లో 215 కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు జీ-20 సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం జనవరి 28న పూర్తయింది. మార్చి 6, 7తో పాటు ఏప్రిల్‌ 26, 27, 28, జూన్‌ 7, 8, 9, 15, 16, 17లలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతస్థాయి స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.జీ-20 సమావేశాలకు హాజర య్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాం తాలను కూడా సందర్శించే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు- చేసి ఎప్పటిక ప్పుడు సమాచారం అందించాలని డీజీపీ ఆదేశించారు. ప్రధానంగా విమానాశ్రయం, ప్రతినిధులు బస చేసే హోట ళ్లు, సమావేశ ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు- చేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లను భద్రతా కమిటీలో సభ్యులగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement