Monday, April 29, 2024

వీరాభిమాని అంటే ఇతడే.. స్వయంగా ఎమ్మెల్యే చిత్రాన్ని టేకు కర్రపై వేశాడు..

సినీ, రాజకీయ రంగాల్లోని వారికి అభిమానులు ఉండటం. ఆ అభిమానులు రకరకాల రూపాల్లో హీరోలు, నేతలపై తమ అభిమానాన్ని చాటుకోవడం సహజం. కానీ వినూత్నమైన ఆలోచనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వారు కొందరే ఉంటారు, అలాంటి వారిలో జగిత్యాల రూరల్ సంగంపల్లి గ్రామానికి చెందిన గుగ్గిల్ల వెంకటేశ్ వృత్తి రీత్యా వడ్రంగి పని చేస్తాడు.. అలాగే సుంకె రవిశంకర్ ఎమ్మెల్యేకి వీరాభిమాని. ఈ క్రమంలోని తాను ఎమ్మెల్యే పై ఉన్న అభిమానంతో 2 రోజుల పాటు శ్రమించి వెంకటేష్ స్వయంగా ఎమ్మెల్యే చిత్రాన్ని టేకు కర్రపై వేశాడు.. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్ లో ఉన్న ఎమ్మెల్యే రవి శంకర్ ని కలిసి తాను రూపొందించిన చిత్ర పటాన్ని అందించాడు. దీనిని ఎమ్మెల్యే రవిశంకర్ చిత్రాన్ని ప్రత్యేకంగా పరిశీలించి వెంకటేష్ కు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement