Sunday, May 5, 2024

హైద‌రాబాద్ లో ఫార్ములా-ఇ గ్రాండ్ ప్రీ రేస్.. కేటీఆర్ కి రామ్ చ‌ర‌ణ్ థ్యాంక్స్

మంత్రి కేటీఆర్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ థ్యాంక్స్ చెప్పారు..హైదరాబాదులో ఫార్ములా-ఇ గ్రాండ్ ప్రీ రేసుకు ఫిబ్రవరి 10నుండి తెరలేవనుంది. హైదరాబాద్ నగరానికి ఇంతటి అమోఘమైన కార్యక్రమాలు తీసుకువస్తున్న కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ పోటీల్లో మహీంద్రా సంస్థకు చెందిన జట్టు కూడా పాల్గొంటోంది. కాగా ఈ కార్యక్రమంలో మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా, తెలంగాణ మంత్రి కేటీఆర్, టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీలతో రామ్ చరణ్ ముచ్చటించారు. దీనిపై చరణ్ ట్వీట్ చేశారు. మహీంద్రా రేసింగ్ జట్టు శిబిరంలో ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నానీలతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని వెల్లడించారు. ఫార్ములా-ఇ రేసింగ్ లో వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement