Thursday, May 2, 2024

TS: నల్లమలలో కార్చిచ్చు… దహనమవుతున్న అడవి…

నల్లమల అడవిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం తాళ్లచెలుక, గుండం ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మంటలు అంటుకున్నట్లు తెలిసింది. అటవీ సిబ్బంది, ట్రెక్కింగ్ వెళ్లిన వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement