Tuesday, May 14, 2024

Fire Accident: శివపార్వతి థియేటర్ లో అగ్నిప్రమాదం

కూక‌ట్‌ప‌ల్లిలోని శివ‌పార్వతి థియేట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న  వెంట‌నే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేట‌ర్ వ‌ద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. అర్థ‌రాత్రి త‌రువాత ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.  థియేట‌ర్‌లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది.  ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంతో థియేట‌ర్‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement